Nandamuri Kalyan Ram ‘Devil’ కోసం 80 భారీ సెట్స్

by sudharani |   ( Updated:2023-09-04 17:07:19.0  )
Nandamuri Kalyan Ram ‘Devil’ కోసం 80 భారీ సెట్స్
X

దిశ, సినిమా : వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్’. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ 80 భారీ సెట్స్ వేయడం విశేషం. 1940 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ సెట్స్ రూపొందించారు. కాగా బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్న సయమానికి చెందిన సెట్స్ వేయటం తనకు ఛాలెంజింగ్‌గా అనిపించిందన్న ఆర్ట్ డైరెక్టర్ గాంధీ.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి ఇందుకు కావాల్సిన సామాగ్రిని తెప్పించామన్నారు. నిర్మాత అభిషేక్ నామా సపోర్ట్ లేకుండా ఈ రేంజ్‌లో భారీ సెట్ వేసి సినిమా రిచ్‌గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదన్నారు.

‘డెవిల్’ సెట్స్ విశేషాలు..

* 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్

* బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు

* బ్రిటీష్ కవర్ డిజైన్‌తో ఉన్న 500 పుస్తకాలు

* 1940 కాలానికి చెందిన కార్గో షిప్

* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌజ్ సెట్

* ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలప, వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ వినియోగం

ఇవి కూడా చదవండి : సౌరవ్ గంగూళీ బయోపిక్‌లో యంగ్ హీరో.. రజనీకాంత్ కూతురి డైరెక్షన్‌లో..








Advertisement

Next Story