AAY Movie: ‘ఆయ్’ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Prasanna |
AAY Movie:  ‘ఆయ్’ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా : ఎన్టీఆర్ బామ్మర్ది గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నార్నే నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే యూత్ లో మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు.

తాజాగా, ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అల్లు అరవింద్ సమర్పణలో నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఆయ్’. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ అయినా మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. ఇప్పటికే రూ. 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టిస్తుంది. జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రష్మిక మందన్న వంటి స్టార్ నటి నటులు ఈ సినిమాని అభినందించారు.

అయితే, తాజాగా ఇప్పుడు ఈ మూవీకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఆయ్’ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ కలెక్షన్స్ బట్టి మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ అంజి కె మణిపుత్ర తెరకెక్కించిన యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.

Advertisement

Next Story