అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-04-10 11:12:41.0  )
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 సినిమా నుంచి మేకర్లు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 3 నిమిషాల వ్యవధి గల వీడియోను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. కాగా, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప ఎక్కడ’ అంటూ విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ఇవి కూడా చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ను బ్రేక్ చేసిన బోరింగ్ మూవీ!

Advertisement

Next Story