'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన ఉపాసన తల్లి.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2023-01-18 13:14:09.0  )
నాటు నాటు పాటకు స్టెప్పులేసిన ఉపాసన తల్లి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఇటీవల 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా కొట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పాటలో చరణ్ డ్యాన్స్‌కు ఫిదా అయిన ఆయన అత్త (ఉపాసన తల్లి శోభనా కామినేని) దావోస్ రోడ్డుపై స్టెప్పులేసింది. దీంతో తన తల్లి 'నాటు నాటు' అంటూ అంటూ చిందులేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన ఉపాసన.. 'అత్తగారు గర్వంగా ఫీలవుతున్నారు. దావోస్‌లో 'నాటు నాటు' స్టెప్పులు' అని మురిసిపోయింది.

Advertisement

Next Story