క్లీంకారా ముఖాన్ని లీక్ చేసిన ఉపాసన.. వైరల్ అవుతున్న ఫోటో

by Prasanna |   ( Updated:2023-10-30 03:28:59.0  )
క్లీంకారా ముఖాన్ని లీక్ చేసిన ఉపాసన.. వైరల్ అవుతున్న ఫోటో
X

దిశ,వెబ్ డెస్క్: మెగా ఫ్యామిలీ ఇటలీలో సందడి చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లికి అంతా సిద్ధం అయిపోయింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఉపాసన అక్కడి ఫోటోలను షేర్ చేసింది. కొణిదెల- కామినేని ఫ్యామిలీ కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసన క్లీంకారా ఫోటోను ఎంత దాచాలని ప్రయత్నించినా నెటిజన్స్ మాత్రం పట్టేశారు. అయితే ఆ ఫోటోల్లో ఉపాసన, క్లీం కారా ఫేస్ కు లవ్ సింబల్ ను యాడ్ చేసింది. దీంతో ఆమె ముఖం కనబడకుండా పోయింది. అయితే నెటిజన్స్ ఊరుకుంటారా.. కొంచం తెలివి ఉపయోగించి మెగా ప్రిన్సెస్ ఫోటోను కనిపెట్టి మరీ ట్రెండ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ ఫూల్ ముందు దిగడం ఫోటో దిగడం వలన నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్‌ చేయలేకపోయింది.. ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరచిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మొత్తానికి క్లీం కారా ఫోటోను చూడటంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Advertisement

Next Story