- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతాపరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన
దిశ, సినిమా: ఇండియాలో అపోలో ఆసుపత్రి స్థాపించి.. లక్షల మందికి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91 వ పుట్టిన రోజును నిన్న (ఫిబ్రవరి 5)గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రి స్టాఫ్ అండ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఉన్నవారంతా ప్రతాపరెడ్డికి సోషల్ మీడియా వేదికన పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే మనవరాలు ఉపాసన అండ్ ఉపాసన అత్తారింటి వారు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రతాపరెడ్డికి విషెష్ చెప్పారు. ఉపాసన.. తాత ప్రతాపరెడ్డికి జీవితంలోని మర్చిపోలేని బహుమతిని ఇచ్చింది. ది అపోలో స్టోరీ అనే బుక్‌ను లాంచ్ చేసింది. దీన్ని అపోలో హాస్పిటల్స్ అమరచిత్ర కథ అసోసియేషన్‌తో ఈ బుక్‌ను ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని ఎలా ఆలోచన వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఇంత డెలవప్‌కు కారణం ఏంటి? ఈ ఆసుపత్రి పెట్టాక జనాలందరికీ మెరుగైన చికిత్స అందించడానికి ఉపాసన తాత ఎంత కష్టపడ్డారు? ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోన్నారు. అనేది ఈ పుస్తకంలో ఉన్నట్లు ఉపాసన వెల్లడించారు.
అలాగే ఈ బుక్ ఇక్కడున్న చిన్నపిల్లలందరికీ జీవితంలో ఎద ఎదగాలి.. అందరికన్నా మంచి పొజిషన్ లో ఉండాలంటే పెద్దగా ఎలా కలలు కనాలి? అనే విషయం ఈ పుస్తకం స్పష్టంగా తెలియజేస్తుందని తెలిపారు. ఈ బుక్ చదివాక ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలో వారికి అవగాహన వస్తుందని రామ్ చరణ్ సతీమణి చెప్పుకొచ్చారు. ఇక అపోలో ఆసుపత్రి చెర్మైన్ ప్రతాపరెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో నిన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.