అలా చేయడం వల్ల Upasana నా చెంప చెల్లుమనిపించింది.. Ram Charan కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-23 07:11:28.0  )
అలా చేయడం వల్ల Upasana నా చెంప చెల్లుమనిపించింది.. Ram Charan కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాలేజీ స్నేహితులైన వీరిద్దరూ ప్రేమించుకుని 2012లో పెద్దలను ఒప్పించి అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన జూన్ 20, 2023 పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘క్లీన్‌కారా కొణిదెల’ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూతురిని చూసుకుంటూ ఇంట్లోనే గడుపుతున్నాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చెర్రీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ అమ్మాయిలకి ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే నచ్చుతుందో అనేది ఆలోచించడం మగవాళ్ళకి ఒక పెద్ద టాస్క్ లాంటిది. నేను ఊరంతా తిరిగి 5 గంటల కష్టపడి ఒక ఖరీదైన బహుమతి కొంటే, దానిని కేవలం 5 సెకండ్స్ లో రిజెక్ట్ చేసేసింది ఉపాసన. అంతేకాదు దాని వల్ల తన చేతిలో చెంప దెబ్బ కూడా తిన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు మరీ దెబ్బలు తినే అంతగా ఏం గిఫ్ట్ ఇచ్చాడో అని ఆలోచనలో పడ్డారు.

Also Read: జపాన్‌లో ‘Rangasthalam’ పది రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?

Advertisement

Next Story