Unstoppable Season2: తదుపరి అతిథులు ఎవరంటే..!

by Hajipasha |   ( Updated:2022-12-16 12:42:56.0  )
Unstoppable Season2:  తదుపరి అతిథులు ఎవరంటే..!
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా పోటీగా వరుస సినిమాలు చేస్తూ.. మరోపక్క హోస్ట్‌గా "అన్ స్టాపబుల్" షోతో దూసుకుపోతున్నాడు. ఈ షోకు మొదటి సీజన్‌లో సినీ సెలెబ్రిటీలు రాగా.. సెకండ్ సీజన్‌లో వీరితోపాటు రాజకీయ నాయకులు వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో తర్వాతి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే దీనికి ఎవరు వస్తున్నారన్నది మాత్రం తెలియదు కానీ, రీసెంట్‌గా ఓ అప్‌డేట్ అయితే చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అయ్యింటారనేది టాక్. అయితే వీరిద్దరూ ముందు నుంచి కూడా మంచి స్నేహితులు. అందుకే బాలయ్య వీరిద్దరినీ కలిపి ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీని తర్వాత వచ్చే గెస్టులు ఎవరన్నది కూడా లీక్ అయ్యింది. వారెవరంటే.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రానున్నారట. తదనంతరం చిరంజీవి, వివి వినాయక్, ఆ తర్వాత కింగ్ నాగార్జున, నాగ చైతన్య, వీరి తర్వాత విక్టరీ వెంకటేష్, రానా ఇలా డబుల్ ఆఫర్‌తో ప్లాన్ చేశారట బాలయ్య. ఇది ఎంత వరకు నిజమనేది తెలియదు కానీ, కాంబినేషన్‌లు మాత్రం అదుర్స్ అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story