'లైగర్' చిత్రానికి ఊహించని భారీ షాక్..

by Seetharam |   ( Updated:2022-08-18 14:51:35.0  )
లైగర్ చిత్రానికి ఊహించని భారీ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ 'లైగర్'. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగష్టు 25న బాక్సాఫీసు బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న చిత్ర యూనిట్‌కి సెన్సార్ బోర్డ్ భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని.. వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. అంతేకాదు.. రౌడీ బాయ్ చేతులతో చెప్పే బోల్డ్ యాక్షన్ డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని పేర్కొంది. దీంతో ఈ చిత్రం నుంచి టోటల్‌గా ఏడు సీన్స్‌ను ఛేంజ్ చేయాలన్న బోర్డు ఆదేశాలను.. చిత్ర యూనిట్ అంగీకరించి 'లైగర్'ను రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌లో కొంత నిరుత్సాహం మొదలైంది.



Advertisement

Next Story