కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ నోట్.. వైరల్ అవుతున్న ఫోటో?

by Prasanna |   ( Updated:2023-06-27 02:32:06.0  )
కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ నోట్.. వైరల్ అవుతున్న ఫోటో?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్లో ఉదయ్ కిరణ్ “విషితా, నీతో ఒక విషయం చెప్పాలి.. మా అమ్మను ఎంతగా ప్రేమించానో నిన్ను కూడా అంతగా ప్రేమించాను. కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. ఒకప్పుడు నాకు అందరూ ఉండేవారు. కానీ ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకు సినిమా పిచ్చితో ఇండస్ట్రీ కి వచ్చాను. ఈ ఇండస్ట్రీ కూడా నన్ను పిచ్చివాడిని చేసి ఆడుకుంది. నీకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాను.విషి నన్ను నమ్ము, వాడు నిజంగా మంచి వాడు కాదు. ఐనా నువ్వు ఏం చెప్పినా వినే స్టేజ్ లో లేవు. కానీ ఏదొక రోజు నా మాటలు, నా బాధ నీకు అర్థం అవుతుంది. కానీ ఆ రోజు నీ పక్కన నీ ఉదయ్ ఉండడు. అందరికీ నా వల్లే కదా ఇంత బాధ. ఇక మీ ఎవరికీ ఈ బాధ ఉండదు. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే నా లైఫ్ కి కూడా ఈరోజుతో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అమ్మా నాకు ఎవరూ లేరు అమ్మా. ఒకసారి నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉందమ్మా. అందుకే వచ్చేస్తున్నా నీ దగ్గరికి. లవ్ యూ విషి. లవ్ యూ ఫరెవర్ " అని రాసాడు.

Also Read: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. సీఎం సంతాపం

Advertisement

Next Story