- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Toofaan Movie OTT: విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా.. ఎందులో చూడొచ్చంటే?
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘తుఫాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించగా.. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఇందులో సత్యరాజ్, మురళీ శర్మ, పుష్ప డాలీ ధనుంజయ, శరత్ కుమార్ వంటి వాళ్ళు నటించారు. అయితే ఈ సినిమా తమిళంలో మజై పిడిక్కాథ మణితాన్ పేరుతో ఆగస్టు 11న తెలుగు వెర్షన్ థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ఇక తమిళ వెర్షన్ మజై పిడిక్కాథ మణితావ్ ఆగస్టు 2న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే తుఫాన్ భారీ వసూళ్లను రాబట్టలేనప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా, ఈ సినిమా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. విడుదలైన రెండు వారాలకే ఆగస్టు 15 గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇది కేవలం తమిళ వెర్షన్ అని తెలుస్తోంది. తొందరలోనే తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.