అక్షయ్ క్యారెక్టర్‌పై ట్వింకిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పిల్లలకు అవే లక్షణాలంటూ

by Prasanna |   ( Updated:2023-06-19 09:18:58.0  )
అక్షయ్ క్యారెక్టర్‌పై ట్వింకిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పిల్లలకు అవే లక్షణాలంటూ
X

దిశ, సినిమా: స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ వ్యక్తిత్వంపై అతని భార్య, నటి ట్వింకిల్ ఖన్నా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భర్తను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టిన ఆమె.. అతను గొప్ప తండ్రి అవుతాడని తాను ముందే ఊహించానని చెప్పింది. అంతేకాదు తమ పిల్లలు కూడా అక్షయ్ పోలికలు, లక్షణాలు కలిగివుండాలని ఆశించినట్లు తెలిపింది. ‘అక్షయ్‌వి అన్నీ ‘ఫైన్ జీన్స్’. కాబట్టి మా సంతానం కూడా అదే లక్షణాలతో పుట్టాలని కోరుకున్నా. అనుకున్నట్లుగానే అవే తెలివితేటలతో జన్మించారు. ఈ విషయంలో నిజంగా నేను చాలా లక్కీ’ అంటూ సంబరపడిపోయింది. దీనిపై స్పందించిన అక్షయ్.. ‘మీరు నాకు కేటాయించిన పనిని సక్రమంగా నిర్వర్తించాను. కాబట్టి ఇప్పుడు మీరు పిలల్లో మేధస్సును పెంపొందిస్తారని బలంగా నమ్ముతున్నా. వారిని చాలా పుస్తకాలు చదివేలా చేయండి’ అంటూ ఒకరినొకరు పొగుడుకున్నారు.

Read More: ఆ పనికి నో చెబుతున్న వరుణ్ తేజ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య?

Advertisement

Next Story