సింగర్ చిన్మయిపై ట్రోల్స్.. ఆమెను అర్థం చేసుకోండి అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్

by Hamsa |   ( Updated:2023-07-01 10:35:35.0  )
సింగర్ చిన్మయిపై ట్రోల్స్.. ఆమెను అర్థం చేసుకోండి అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్
X

దిశ, వెబ్ డెస్క్: సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంచలన పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మీటూ ఉద్యమ సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరమత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కోలీవుడ్‌లో బహిష్కరణను కూడా ఎదుర్కొంది. ఇటీవల మహిళలకు సపోర్ట్‌గా ఉంటూ పలు పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఖాతాను టాగ్ చేశారు.

చిన్మయి‌పై ట్రోల్స్ రావడంతో తట్టుకోలేని రాహుల్ తాజాగా, తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ఎమోషనల్ నోటు షేర్ చేశాడు. ‘‘ చిన్నయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమె చేస్తున్న పనిని మెచ్చుకోకపోయినా కానీ, అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైనా సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్థం అవుతుంది’’ అంటూ రాసుకొచ్చాడు.

Read More: డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు గురయ్యానంటున్న కాజల్.. భర్త ఏం చేశాడంటే..

Advertisement

Next Story

Most Viewed