నాగార్జున హీరోయిన్‌పై ట్రోల్స్.. సిగ్గుండాలంటూ ఒక్క పోస్ట్‌తో స్ట్రాంగ్‌గా ఇచ్చి పడేసిన బ్యూటీ

by Hamsa |   ( Updated:2024-02-20 07:41:14.0  )
నాగార్జున హీరోయిన్‌పై ట్రోల్స్.. సిగ్గుండాలంటూ ఒక్క పోస్ట్‌తో స్ట్రాంగ్‌గా ఇచ్చి పడేసిన బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరో నాగార్జున ‘సూపర్’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల అయేషా టాకియా తన కొడుకుతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్‌లో కెమెరాలకు చిక్కింది. ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని చూసిన నెటిజన్లు అయేషా పై ట్రోల్స్ చేశారు.

తాజాగా, ట్రోల్స్‌పై స్పందిస్తూ అయేషా ఫైర్ అవుతూ తన ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ నా సోదరి హాస్పిటల్‌లో చేరడంతో ఆమెను చూడటానికి గోవాలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో కొందరు నన్ను వీడియోలు తీశారు. వాటిని చూసిన చాలా మంది నాపై కామెంట్లు దారుణంగా అనిపించింది. అయినా నా గురించి తప్ప ఈ దేశంలో డిస్కస్ చేయడానికి వీళ్ళకి వేరే ముఖ్యమైన విషయాలు ఏం లేవా? అయినా ఆసుపత్రికి కూడా అందంగా రెడీ అయి వెళ్తారా? ఇప్పుడు నాకు సినిమాలు చేయాలనే ఆసక్తి లేదు.

నా కుటుంబంతో కలిసి ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను. లైబ్‌లైట్‌లో ఉండాలనే కోరిక అసలే లేదు. కనుక నా గురించి ఆలోచించడం మానేసి మీరు మీ పని చూసుకుంటే బాగుంటుంది. అయినా 15 ఏళ్లకి ముందు టీనేజ్‌లో కనిపించినట్లుగా ఇప్పటికీ ఉండాలంటే ఎలా. అయినా అలా ఆలోచించడానికి కూడా సిగ్గుండాలి. మీ అభిప్రాయాలను కామెంట్లను మడిచి పెట్టుకోండి. నా కమ్‌బ్యాక్ గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు’’ అంటూ రాసుకొచ్చింది.

Read More..

ఆఫ్ ఇన్నర్ కనిపించేలా టెంప్టింగ్ ఫొటోలకు ఫోజులిచ్చిన బిగ్‌బాస్ అరియానా?


Advertisement

Next Story

Most Viewed