- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ చాందిని చౌదరిపై ట్రోల్స్.. గర్వంగా ఉందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో పలు చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తుంది. ఇటీవల ఈ అమ్మడు గామి మూవీతో అలరించింది. ప్రస్తుతం చాందిని చౌదరి ‘షాప్ మూర్తి’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చాందిన పాల్గొనగా.. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటని యాంకర్ అడగ్గా.. నేను ఏ మ్యాచ్ స్టేడియంలో చూడలే కాబట్టి.. ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటా. అయితే మాది ఆంధ్ర టీమ్ లేదు అని చెప్పింది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు చాందినిపై దారుణమైన ట్రోల్స్ చేశారు. హైదరాబాద్‌లో ఉండి.. ఆ టీమ్‌కు సపోర్ట్ చేయవా? అని నెట్టింట ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
తాజాగా, చాందిని ట్రోల్స్‌పై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఓ ఈవెంట్ లో నన్ను నా ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ గురించి అడిగారు. దాంతో నేను మ్యాచ్ చూడను కాబట్టి చూశాక చెప్తాను అని చెప్పాను. అలాగే ఆంధ్ర కాబట్టి ఓ టీమ్ ఉంటే బాగుండని అన్నాను. దాన్ని ట్రెండ్‌కి తగ్గట్టు ఓ వీడియో చేసి కొందరు వైరల్ చేస్తున్నారు. నేను రెండు స్టేట్స్‌కు చెందిన దాన్ని కాబట్టి గర్వంగా ఉంది. ఈ ఏడాది SRH టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం చాందిని పోస్ట్ వైరల్ అవుతుండగా.. కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఉద్దేశంలో తప్పు లేదని అంటున్నారు.