‘గుంటూరు కారం’లో మూడో హీరోయిన్‌ను సెట్ చేసిన త్రివిక్రమ్?

by Anjali |   ( Updated:2023-09-19 06:35:57.0  )
‘గుంటూరు కారం’లో మూడో హీరోయిన్‌ను సెట్ చేసిన త్రివిక్రమ్?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయినప్పటకి ఇప్పుడు తాజాగా మూడవ హీరోయిన్ కూడా ఉందని నెట్టింట వార్త వైరల్ అవుతుంది. కేవలం రెండు సీన్స్ కోసం మరో స్టార్ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట మూవీ టీం. మరి ఇంతకీ ఆ మూడో హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే కాజల్ అగర్వాల్ అని టాక్ వినపడుతుంది. ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.

Read More..

నిర్మాతతో‌ లవ్‌లో పడ్డ త్రిష.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట

Advertisement

Next Story

Most Viewed