ఆ హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిన త్రివిక్రమ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

by Jakkula Samataha |   ( Updated:2024-05-20 06:15:48.0  )
ఆ హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిన త్రివిక్రమ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
X

దిశ, సినిమా : మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా ఆయన తెలుగు హీరోయిన్స్ జీవితాలను నాశనం చేశాడంటూ ఓ వార్త సంచలనంగా మారింది.

అసలు విషయంలోకి వెళ్లితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆయన తన సినిమాలలో మాటలు, డైలాగ్స్‌తో మాయ చేస్తుంటాడు. అయితే ఆయన తీసిని అత్తారింటికి దారేది? సన్నాఫ్ సత్యమూర్తి, ఆహా, ఇలా చాలా సినిమాల్లోనూ సెంకడ్ హీరోయిన్ ఉండడం అనేది కామన్. అయితే సాధ్యమైనంత వరకు ఆయన సినిమాల్లో రెండో హీరోయిన్ అవసరం ఉండదు, పోనీ సెకండ్ హీరోయిన్ కు అంత ప్రియారిటీ ఇస్తాడా అంటే అది లేదు ఇలా ఆయన ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్‌కు అంతగా స్క్రీన్ స్పెస్, కనీసం ఓ సాంగ్ కూడా ఇవ్వడు. దీంతో త్రివిక్రమ్ సెంకడ్ హీరోయిన్ అని చెప్పి హీరోయిన్స్‌ను మోసం చేస్తున్నాడు అంటున్నారు నెటిజన్స్. అంతే కాకుండా ఈ మధ్య స్క్రిప్ట్ చెప్పేటప్పుడు త్రివిక్రమ్ తమ పాత్రకు స్పెస్ ఉంటుందని, సినిమాలో కొన్ని సీన్స్‌లో మీరు హైలెట్‌గా కనిపిస్తారని చెబుతారు. కానీ అలా ఏం ఉండదు. మూవీ విడుదలయ్యాక అసలు మా క్యారెక్టర్‌ను వెతుక్కోవాలని, ఈ విషయాన్ని ఇటీవల హీరోయిన్ ఈషా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడుతూ.. అరవింద సమేత కోసం నేను బైక్ కూడా నేర్చుకున్నాను. కానీ సినిమాలో నా సన్నివేశాలు ఎడిట్ చేసి లేపేశారని ఆమె వేదన చెందారు. కాగా, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story