మా లక్ష్మి చనిపోయింది అంటూ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్

by Hamsa |   ( Updated:2023-09-14 06:59:43.0  )
మా లక్ష్మి చనిపోయింది అంటూ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల వెంకీ, ఢీ, దూకుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కెరీర్ కష్టాల్లో పాడేసుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా, ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను మొదటిసారిగా ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. 13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న ఆవు చనిపోవడంతో శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్ చేశాడు. నా పొలంలో మొదటి ఆవును పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మేమంతా ఆమెను ప్రేమించాము. 13 సంవత్సరాలు కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నాము !! నా కూతుళ్లు ఆమెను ప్రేమగా ‘లక్ష్మి’ అని పిలిచేవారు. సకల ఆచార వ్యవహారాలతో వీడ్కోలు పలుకుతున్నాము’’ అంటూ రాసుకొచ్చాడు. ఇక శ్రీను వైట్ల సినిమాల విషయానికొస్తే గోపిచంద్‌తో మ్యాచో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Advertisement

Next Story