కత్రినా కైఫ్‌కు రూ.5 కోట్లు ఎగ్గొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో..?

by sudharani |   ( Updated:2023-11-30 15:24:41.0  )
కత్రినా కైఫ్‌కు రూ.5 కోట్లు ఎగ్గొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలు తీసిన ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇక కత్రినా తన స్నేహితుడు విక్కీని ప్రేమించి పెళ్లి చేసుకుని.. అటూ ఫ్యామిలీ లైఫ్‌తో పాటు.. సినీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. కత్రినా తెలుగులో సినిమా తీసినప్పుడు తన దగ్గర డబ్బు తీసుకుని ఆ డబ్బు ఇవ్వకుండా ఓ స్టార్ హీరో మోసం చేశాడట. ఆ విషయాల్లోకి వెళితే..

అయితే కత్రినా కైఫ్ తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’, బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ మూవీలు చేసింది. ఇక ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలతో చాలా స్నేహంగా ఉండేదట. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో తాను నిర్మాత అవ్వాలనుకుంటున్నానని చెప్పి కత్రినా దగ్గర నుంచి రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. అయితే ఆ స్టార్ హీరో నిర్మాతగా మారి తీసిన సినిమా ప్లాప్ కావడంతో.. తిరిగి ఆ డబ్బులు కత్రినాకు ఇవ్వలేదట. కొన్ని సార్లు కత్రినా అడిగినప్పటికీ నువ్వు ఎప్పుడు నాకు ఇచ్చావ్ అంటూ ఎదురు తిరుగేవాడట. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియదు కానీ, ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story