- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naveen Polishetty : లైఫ్ ఒక జిందగీ అయిపోయింది.. తన స్థితిపై నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తాజాగా అమెరికాలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చేతికి ఫ్రాక్చర్ అవ్వగా, కుడి కాలుకు గాయమైంది. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ను డిఫరెంట్గా ఇచ్చి అభిమానులను ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘లైఫ్ ఒక జిందగీ అయిపోయింది.. సీయూ సూన్ జానేజిగర్స్’ అంటూ హెల్త్ అప్డేట్ ఇచ్చారు. వీడియోలో ఆయన చేతికి పట్టీ ధరించి ఉండగా, సింగిల్ హ్యాండ్ వల్ల ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించారు.
తన చేతిని పైకి లేపలేకపోతున్నానని వీడియోలో నవీన్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, అభిమానులు స్పందిస్తున్నారు. అంత నొప్పిలో కూడా మాకు వినోదం పంచుతున్నారని అభిమానులు చెబుతున్నారు. నొప్పిలో కూడా తనపై తానే ట్రోల్స్ చేసుకుంటున్నాడని, నిజమైన జాతిరత్నం బ్రో.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.