చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యేక పూజలు

by Hamsa |   ( Updated:2023-10-22 12:04:59.0  )
చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్‌కు ప్రత్యేక పరిచయం చేయాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, పూనమ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేసింది. నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పూనమ్ తన కుటుంబ సమేతంగా ఆమె కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అలాగే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూనమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ వయసులో చంద్రబాబు జైల్లో ఉండటం నన్ను కలచి వేసింది. ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story