వ‌ర‌స్ట్ ఫిల్మ్‌ 'Circus' అంటూ..షాకింగ్ కామెంట్స్ చేసిన Hebah Patel !

by Prasanna |   ( Updated:2022-12-31 06:58:55.0  )
వ‌ర‌స్ట్ ఫిల్మ్‌ Circus అంటూ..షాకింగ్ కామెంట్స్ చేసిన Hebah Patel !
X

దిశ, సినిమా : ర‌ణ్‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన బాలీవుడ్ ఫిల్మ్‌ 'స‌ర్కస్'. పీరియాడిక‌ల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, రోహిత్ శెట్టి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 23న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ‌స్ట్ వీక్‌‌లో కేవ‌లం రూ.30 కోట్ల క‌లెక్షన్స్ మాత్రమే రాబ‌ట్టింది. ర‌ణ్‌వీర్‌ సింగ్ కెరీర్‌లో లోయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. కాగా 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కెరీర్ ఆరంభంలో పెద్ద విజ‌యాల్ని అందుకున్న హీరోయిన్ హెభాప‌టేల్‌ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. 'స‌ర్కస్' 2022లో వ‌చ్చిన‌ చెత్త సినిమా..ఈ వ‌ర‌స్ట్ ఫిల్మ్‌తో ఈ ఇయర్ ముగుస్తున్నది'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌‌లో కామెంట్ చేస్తూ మూవీలోని ఓ స్టిల్‌ను షేర్ చేసింది. హెభాప‌టేల్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Also Read..

పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా !

Advertisement

Next Story