మరోసారి రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. ఏకంగా ఆ యంగ్ డైరెక్టర్‌తో మూవీ..?

by Kavitha |
మరోసారి రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. ఏకంగా ఆ యంగ్ డైరెక్టర్‌తో మూవీ..?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లలో విలన్ క్యారెక్టర్లలో మెప్పించిన ఈయన ఆ తర్వాత హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే గోపీచంద్ మరోసారి రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఘాజీ డైరెక్టర్‌కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్‌లో సమాచారం.

సంకల్ప్ రెడ్డి కెరీర్‌లో సైతం ‘ఘాజీ’ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు. అయితే కొత్త తరహా కథాంశంతో సంకల్ప్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని, త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. మరి ఈ కాంబోలో వస్తున్న సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story