హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో..? ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిన భామ

by Hamsa |
హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో..? ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిన భామ
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను మీడియా ముఖంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మొత్వానీ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా టాలీవుడ్ హీరో హన్సికను బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్ కు వెళ్దాం వస్తావా అంటూ విసిగించే వాడని.. అతనికి ఈ అమ్మడు తగిన బుద్ధి చెప్పినట్లు దీనిని స్వయంగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. తాజాగా, హన్సిక ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘ టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌజ్ ఫేస్ చేశానని నేనెప్పుడు మాట్లాడాను? మీకు తోచింది రాయడం ఆపండి. నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా రాసేయడం ఆపండి. వైరలవుతున్న వార్తల్లో పేర్కొన్నట్లుగా నేను ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాబట్టి దయచేసి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే న్యూస్ పబ్లిష్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది.

Advertisement

Next Story