మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన సత్యదేవ్..

by sudharani |   ( Updated:2022-09-30 13:17:10.0  )
మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన సత్యదేవ్..
X

దిశ, సినిమా: టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరు నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న హీరో.. మరో కోత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. శుక్రవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో అతని కొత్త చిత్రం ప్రారంభమైంది. బాల సుందరం, దినేష్ సుందరం లాంచ్ వేడుకకు హాజరవగా.. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ మూవీలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కీలక పాత్ర పోషించనున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. నటుడిగా సత్యదేవ్‌కు ఇది 26వ చిత్రంకాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి : 'సర్దార్‌'లో విశ్వరూపం చూపించిన కార్తీ.. ఆకట్టుకుంటున్న టీజర్

Advertisement

Next Story