ఆ హీరోయిన్ డాన్స్ అంటే చాలా ఇష్టం.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
ఆ హీరోయిన్ డాన్స్ అంటే చాలా ఇష్టం.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం టుడే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ మూవీ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ ‘సలార్’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ‘‘శృతిహాసన్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక ప్రభాస్ - శృతిహాసన్ కాంబినేషన్‌ రాబోతున్న ఈ సినిమాలో కచ్చితంగా ఒక డ్యూయెట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఎందుకు పాట పెట్టలేదు అంటూ ప్రశాంత్‌ను జక్కన్న ప్రశ్నిస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. స్టార్టింగ్‌లో సాంగ్ పెట్టాలని అనుకున్నాం. కానీ ఈ మూవీ మొత్తం ఒక డ్రామాగా కొనసాగుతుంది. అందుకే సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదని అనుకుని, వీరిద్దరి కాంబోలో ఒక డ్యూయెట్ పెట్టలేదని ప్రశాంత్ చెబుతారు. ఇక రాజమౌళి.. శృతిహాసన్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed