Hanuman Teaser REVIEW పై కోలీవుడ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hajipasha |   ( Updated:2023-08-25 12:43:37.0  )
Hanuman Teaser REVIEW పై కోలీవుడ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ 'హనుమాన్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలే పలు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా రిలీజైన క్షణం నుంచి ప్రేక్షకుల్లో ఊహించని రెస్పాన్స్‌ లభిస్తుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్.. ట్విట్టర్ వేదికగా మూవీ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ చూశాను. మాస్, క్లాస్, ఫాంటసీ అంశాలతో కూడిన విజువల్స్‌తో టీజర్ చాలా బాగుంది. ముఖ్యంగా హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత, నటి వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్‌గా పెర్‌ఫార్మ్ చేశారు. 'హనుమాన్' మూవీ యూనిట్‌కు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు అట్లీ.

Advertisement

Next Story