Anil Ravipudi : నేడు టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే

by Anjali |   ( Updated:2023-11-23 05:11:15.0  )
Anil Ravipudi : నేడు టాలీవుడ్  డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్ 2, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి.. పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. రీసెంట్ గా బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీసును ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత వినిపించేది అనిల్ రావిపూడి పేరే. ఈ దర్శకుడు టాలీవుడ్‌లో అంతగా పేరు సంపాదించుకున్నారు. కాగా నేడు అనిల్ రావిపూడి 41 ఏళ్ల లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో ఈ డైరెక్టర్‌కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story