నేడు స్టార్ హీరోయిన్ త్రిష పుట్టిన రోజు..

by Hamsa |   ( Updated:2023-05-04 04:42:34.0  )
నేడు స్టార్ హీరోయిన్ త్రిష పుట్టిన రోజు..
X

దిశ, వెబ్ డెస్క్: నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పుట్టిన రోజు. మే 4న 1983లో చెన్నైలో జన్మించారు. 1999 మిస్ చెన్నై పోటీని గెలుచుకున్న తర్వాత ఈ బ్యూటీ మొదట ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో నటించి తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకుంది. త్రిష 20 ఏళ్లుగా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుండటం విశేషం. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. పొన్నియన్ సెల్వన్-2 సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రాలను కట్టిపడేస్తుంది. 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్టార్ హీరోయిన్‌గా ఇండస్టీలో దూసుకుపోతుంది.

Advertisement

Next Story

Most Viewed