నేడు హీరో సుధీర్ బాబు పుట్టినరోజు..!

by Anjali |   ( Updated:2023-05-11 05:07:55.0  )
నేడు హీరో సుధీర్ బాబు పుట్టినరోజు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రేమ కథా చిత్రం’’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో సుధీర్ బాబు.. ప్రస్తుతం ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘హరోం హర’’ చిత్రంలో పాన్ ఇండియా కథాంశంతో కనిపించనున్నాడు. కాగా ఈ రోజు(మే 11)న ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా నుంచి మొదటి ఫస్ట్ ట్రిగ్గర్ పేరుతో చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఈ మూవీ 1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పం బ్యాక్ డ్రాప్‌‌లో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫీ అందించగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా పని చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని.. తెలుగు, తమిళం, కన్నడ మలయాళం, హిందీ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా నేడు ఈ హీరో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

Read More: నేడు ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దూసుకుపోతున్న అదా శర్మ పుట్టిన రోజు..


Advertisement

Next Story