Tharun Bhascker : నేడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-11-05 04:35:47.0  )
Tharun Bhascker : నేడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్..తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌తో ఆగిపోలేదు. నటుడిగానూ సత్తా చాటుతున్నారు తరుణ్. పలు సినిమాల్లో నటించి అందర్ని మెప్పించారు. ఇప్పుడు తరుణ్ దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’లో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఇటు దర్శకత్వం చేస్తూ అటు నటుడిగా రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. నేడు తన 35 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Advertisement

Next Story