Krithi Shetty birthday:నేడు అందాల తార కృతి శెట్టి పుట్టినరోజు

by Jakkula Mamatha |
Krithi Shetty birthday:నేడు అందాల తార కృతి శెట్టి పుట్టినరోజు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి సుపరిచితమే. ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. బేబమ్మ మొదటి మూవీతోనే కుర్ర కారు హృదయాలను దోచుకుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని నాగచైతన్య, రామ్ పోతినేని, నాని, శర్వానంద్, నితిన్ వంటి హీరోల సరసన నటించి అలరించింది.

ఈ అమ్మడు శ్యామ్ సింఘ రాయ్, బంగార్రాజు, ది వారియర్, కస్టడీ, మనమే వంటి చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది. అయితే నేడు(సెప్టెంబర్ 21) ఈ యంగ్ బ్యూటీ, అందాల తార పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తదుపరి సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, వీడియోలు కూడా ట్విట్టర్‌లో సందడి చేస్తున్నాయి.

Next Story

Most Viewed