Today Allu Arjun Birthday: బన్ని అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ..!

by Javid Pasha |   ( Updated:2023-04-08 08:58:11.0  )
Today Allu Arjun Birthday: బన్ని అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ..!
X

దిశ, వెబ్ డెస్క్: ‘మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు’ అంటూ 2003లో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అదిరిపోయే స్టెప్పులతో చిరంజీవి మేనల్లుడనిపించుకున్నాడు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్నాడు. మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అలా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్ని. 20 ఏళ్ల సినీ హీరో కెరీర్ లో ఇప్పటి వరకు 22 మూవీల్లో నటించాడు బన్ని. కాగా ఇవాళ (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిందే ఈ చిన్న కథనం.

ఇవి కూడా చదవండి:

Today Akkineni Akhil Birthday: ఇవాళ ‘ఏజెంట్’ అఖిల్ బర్త్ డే

Today Nithya Menon Birthday: ఈ భామని చూస్తే ఎవరికైనా గుండె జారి గల్లంతవ్వాల్సిందే..!


గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపీ, పరుగు, ఆర్య 2, దేశముదురు వంటి సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించి అమ్మాయిల మనసులు దోచాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల్లో లవర్ బాయ్ అనే పదానికి కొత్తం నిర్వచనం ఇచ్చాడు బన్ని. ఇక వరుడు, వేదం, ఎవడు, S/O సత్యమూర్తి వంటి సినిమాల్లో విలక్షణమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఎమోషన్ తో కూడిన బలమైన మెసేజ్ ను ఈ సినిమాల ద్వారా అందించేందుకు అల్లు అర్జున్ కృషి చేశాడు. బద్రినాథ్, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనోడు, దువ్వడా జగన్నాథం, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాల్లో మాస్ హీరోగా అదరగొట్టాడు. ఇక 2020లో వచ్చిన అల వైకుంఠపురం సినిమాతో అటు క్లాస్ ను.. ఇటు మాస్ ను మెప్పించాడు.


ఇక ఈ మూవీలోని ఒక్కో పాట ఓ ఆణిముత్యం కాగా.. అల్లు అర్జున్ తన క్లాస్, మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశాడు. ఇక 2021లో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికి తెలిసిందే. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. క్రికెటర్లు, పొలిటిషియన్లు, సెలబ్రిటీలు.. ఇలా ప్రతి ఒక్కరూ బన్ని డైలాగులు, మేనరిజం, డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. ఆయనను అనుకరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ మీద రీల్స్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కొనసాగుతోంది. ఇక మూవీతో ఐకాన్ స్టార్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా అద్భుత నటనతో బన్ని ఇప్పటివరకు 6 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు అందుకున్నాడు.


Today Nithya Menon Birthday: ఈ భామని చూస్తే ఎవరికైనా గుండె జారి గల్లంతవ్వాల్సిందే..!

Advertisement

Next Story