పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

by Hamsa |   ( Updated:2023-06-29 07:42:54.0  )
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా సినిమాలకు గ్యాప్ రాకుండా ఉండాలని పలు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. ఇందులోంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే పవన్ కల్యాణ్‌కు వారాహి యాత్రలో జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అందువల్ల ‘బ్రో’ సినిమా టీజర్ ఆలస్యమవుతుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ, ఆరోగ్యం బాగా లేకపోయినా అభిమానులను సంతోష పెట్టేందుకు పవన్ డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్‌ ఇచ్చారు. బ్రో టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో అది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ సమయం ఎప్పుడెప్పుడు గడుస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read More: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. పోస్ట్‌తో క్లారిటీ

Advertisement

Next Story