అదిరిపోయిన టిల్లు స్క్వైర్ ట్రైలర్.. నా వీక్ పార్ట్ అదే అంటున్న అనుపమ

by Jakkula Samataha |   ( Updated:2024-02-14 14:05:14.0  )
అదిరిపోయిన టిల్లు స్క్వైర్ ట్రైలర్.. నా వీక్ పార్ట్ అదే అంటున్న అనుపమ
X

దిశ, సినిమా : యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ టిల్లు స్క్వైర్. గతంలో సిద్దు జొన్నల గడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ డీజే టిల్లు, ఫిబ్రవరి 12న రెండేళ్లకిందట థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిద్ధు తన మార్క్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. అలాగే కామెడీ, రొమాన్స్, క్రైమ్‍తో డీజే టిల్లు ప్రేక్షకులను అలరించింది, ఇదంతా పక్కన పెడితే, ఈ మూవీలో డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఆడియన్స్‌ను ఎంతో మెప్పించింది. టిల్లు అన్న డీజే పెడితే అంటూ యూత్‌లో మంచి హుషారు నింపాడు సిద్ధు. ఇక ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఈ సాంగ్ ఉండాల్సిందే.

దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‍గా టిల్లు స్క్వేర్ వస్తోంది.ఇక ఇందులో సిద్దు, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్‌గా నటించింది. దీంతో ప్రేక్షకులు డీజే టిల్లు స్క్వైర్ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. టిల్లు స్క్వైర్ మూవీ ట్రైలర్లోనూ సిద్దు జొన్నలగడ్డ జోష్ అదిరిపోయింది.

ముఖానికి బ్లాక్ ఫేస్ ప్యాక్ వేసుకొని టిల్లు స్క్వేర్ ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చాడు సిద్ధు. అతడికి బంధువులు పెళ్లి సంబంధం తీసుకొస్తే.. డీజే టిల్లు.. రాధికను గుర్తు చేసుకుంటారు. అదే బాడీ లాంగ్వేజ్‌తో సిద్ధు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక అనుపమ తన హాట్ హాట్ లుక్స్‌తో టిల్లుతో లిప్ లాక్ సీన్‌లో కనిపిస్తుంటుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన వారు వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ అట్రాక్టివ్‍గా ఉంది. లిప్‍లాక్‍తోనూ రెచ్చిపోయారు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో సిద్ధు మరోసారి రెచ్చిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story