DJ Tillu : ‘టిల్లు స్క్వేర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

by Kavitha |   ( Updated:2024-02-09 07:28:32.0  )
DJ Tillu : ‘టిల్లు స్క్వేర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

దిశ, సినిమా: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో విడుదలై అద్భుతమైన విజయం సాధించిన మూవీ ‘డిజె టిల్లు’. యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో గా ... మోస్ట్ బ్యూటిఫుల్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లు సాధించింది. ముఖ్యంగా ఇందులో హీరో సిద్దు నటనకు , బాడీ లాంగ్వేజ్ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి యూత్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే రాధిక గా హీరోయిన్ కి కూడా ఎంతో ఫేమ్ లభించింది. ఇక ఈ మూవీకి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ తో సీక్వెల్ కూడా రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. మార్చి 29న విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story