‘టైగర్ నాగేశ్వరరావు’ సెన్సార్ పూర్తి.. వచ్చిన సర్టిఫికెట్ ఇదే..!

by Anjali |   ( Updated:2023-10-18 05:18:04.0  )
‘టైగర్ నాగేశ్వరరావు’ సెన్సార్ పూర్తి.. వచ్చిన సర్టిఫికెట్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: వంశీకృష్ణ దర్శకత్వంలో తెరక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ అక్టోబరు 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ అందించింది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా భారీగా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్ కథానాయికగా నటించగా.. జీవిప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చారు. రూ.50 కోట్లతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, మురళి శర్మ, గాయత్రి భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story