‘టైగర్ నాగేశ్వరరావు’ తమిళ్‌ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

by Nagaya |   ( Updated:2023-10-26 15:12:28.0  )
‘టైగర్ నాగేశ్వరరావు’ తమిళ్‌ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 20న భారీ అంచనాలతో విడుదలై మంచి హిట్ అందుకుంది. యాక్షన్ సీన్స్‌లో టైగర్ నాగేశ్వరరావు పాత్రతో రవితేజ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. దీంతో ఈ మూవీకి మొదటి రోజు మొదటి షో బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ఇదిలావుంటే.. తాజాగా మూవీ యూనిట్ తమిళ వెర్షన్‌ను అక్టోబర్ 27న థియేట‌ర్‌లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story