‘Tippu Sulthan’ నిర్మాతకు తీవ్రస్థాయిలో బెదిరింపులు.. సారీ ఇక ఆ సినిమా తీయనంటూ ట్వీట్

by sudharani |   ( Updated:2023-07-25 12:27:57.0  )
‘Tippu Sulthan’ నిర్మాతకు తీవ్రస్థాయిలో బెదిరింపులు.. సారీ ఇక ఆ సినిమా తీయనంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నిర్మాత సందీప్ సింగ్ తన కొత్త సినిమా ‘టిప్పు సుల్తాన్’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా గురించి తనకు, తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే ఈ సినిమా ఆపివేస్తున్నాను అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

ఈ మేరకు ‘‘హజ్రత్ టిప్పు సుల్తాన్‌పై సినిమా తీయను. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను బెదిరించడం లేదా దుర్వినియోగం చేయడం మానుకోవాలని నా తోటి సోదరులు, సోదరిని నేను దయతో అభ్యర్థిస్తున్నాను. నేను ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినైనా మతపరమైన మనోభావాలను గాయపరిచి ఉంటే హృదయపూర్వకంగా వారిని క్షమాపణలు కోరుతున్నాను. అన్ని విశ్వాసాలను గౌరవిస్తానని నేను దృఢంగా నమ్ముతాను కాబట్టి అలా చేయడం నా ఉద్దేశం కాదు. భారతీయులుగా, మనం ఎప్పటికీ ఏకం చేద్దాం.. ఎల్లప్పుడూ ఒకరికొకరు గౌరవం ఇద్దాం! ప్రేమతో సందీప్ సింగ్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ MORE

వాచ్ మెన్ కొడుకును చదివిస్తున్న జబర్దస్త్ వర్ష

Advertisement

Next Story