సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్‌కు కూడా వార్నింగ్

by Anjali |
సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్‌కు కూడా వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపుతానని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నటుడు సల్మాన్‌కు భారీగా భద్రతను పెంచారు. కాగా గతంలో సల్మాన్‌కు బెదిరింపులు వచ్చినప్పుడు రాఖీ సావంత్ స్పందించి ..‘సల్మాన్ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆయనను ఎలాంటి హాని కలిగించవద్దని కోరారు. దీంతో తాజాగా రాఖీ సావంత్‌ను ఈ విషయంలో తలదూరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ.. బుధవారం ఉదయం 7.22 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 1.19 సమయంలో రెండు సార్లు గుర్జన్ అనే వ్యక్తి ఆమెకు మెయిల్ పంపాడు.

Advertisement

Next Story