ప్రకృతికి విరుద్ధంగా ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి : దియా మీర్జా

by Kavitha |   ( Updated:2024-03-17 07:30:57.0  )
ప్రకృతికి విరుద్ధంగా ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి : దియా మీర్జా
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో అనతి కాలంలోనే ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నా సెలబ్రిటీలలో దియా మీర్జా ఒకరు. ఫెమినా మిస్ ఇండియా2000 టైటిల్‌‌ను గెలుచుకున్న ఈ అమ్మడు ‘హై టెర్రే హిల్ మే’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో, దియా మీర్జా స్టార్ గ్లామర్ హీరోయిన్‌గా సక్సెస్ ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తొంది.

ఇదిలా ఉంటే ప్రతి ఒక సెలబ్రెటి .. మొక్కలు నాటడం.. జంతువులను పెంచుకోవడం వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం చేస్తుంటారు. అలా మీర్జా కూడా ప్రకృతి ప్రేమికురాలు. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా పాటుపడుతూ ఉంటుంది. ఇటీవల నైరోబీలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు ఆమె హాజరైంది. ‘ఈ సదస్సులో పర్యావరణవేత్తలను కలుసుకునే అవకాశం వచ్చింది.. నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే మనిషి చేస్తున్న తప్పిదాలు పర్యావరణానికి ఎంతో హాని తలపడుతున్నాయి. ఈ యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా 2032 కల్లా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్‌ మొక్కలు నాటాలన్న ఆ సదస్సు నిర్ణయం ఎంతో తృప్తినిచ్చింది. కానీ ఎన్ని మొక్కలు నాటిన.. మనలో మార్పు రానంత వరకు ప్రకృతికి ప్రమాదం తప్పదు. మా అబ్బాయి చదివే క్లాసులో దాదాపు 90 శాతం మంది పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

ఇందుకు కారణం పర్యావరణ కాలుష్యం. ఇలా మన అవసరాల కోసం భవిష్యత్‌ తరాల బతుకును పణంగా పెడుతున్నాం. ముందు తరాల వారు మనల్ని తిట్టుకోవద్దంటే.. ఇప్పటికైనా మేల్కోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయాలి. కాలుష్యాన్ని నియంత్రించి ప్రకృతి వనరులను ధ్వంసం చేసేవారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రకృతి మలినం అవ్వకుండా ఉంటుంది. ముందు తరాల మనుగడ సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నది దియా.

Read More..

రాడిసన్ డ్రగ్స్ కేసులో నేను ఇరుక్కోవడానికి కారణం అదే.. నిహారిక ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story