వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్!

by Prasanna |   ( Updated:2023-10-08 11:59:20.0  )
వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం హీరోయిన్‌లంతా కూడా ఫైటర్స్‌ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్‌ కోసం పోరాడుతునే ఉన్నారు. ఇందులో ఇక కెరీర్ మొత్తం ముగిసింది అనుకుంటున్న టైంలో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్‌లు ఇంట్రెస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు. వారే సాయి పల్లవి, పూజ హెగ్దే. వీరిద్దరు సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ఫైనల్‌గా ఈ వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన సాయి పల్లవి వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. తమిళ్‌లో శివ కార్తికేయన్ సరసన నటిస్తోంది.

అలాగే తెలుగులో నాగచైతన్య పాన్ ఇండియా మూవీకి కూడా సాయి పల్లవి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు బాలీవుడ్‌ మేకర్స్ రూపొందిస్తున్న రామాయణంలోనూ సీత పాత్రకు సాయి పల్లవిని పరిశీలిస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇక పూజా విషయానికొస్తే షాహిద్ కపూర్‌ హీరోగా తెరకెక్కుతున్న మూవీతో పాటు మరో మూవీతో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్‌ కూడా చేస్తుంది. మరి ఈ మూవీస్‌తో మళ్లీ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed