Lord Ganesh : ఈ ఏడాది ట్రెండ్ సెట్ చేస్తున్న వెరైటీ వినాయకులు

by Prasanna |   ( Updated:2024-09-10 14:11:59.0  )
Lord Ganesh : ఈ ఏడాది ట్రెండ్ సెట్ చేస్తున్న వెరైటీ వినాయకులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశమంతటా వినాయక చవితి పండుగ సందడీ కనిపిస్తుంది. గతేడాది లాగే ఈసారి కూడా కొన్ని చోట్ల వెరైటీ వినాయకులు నిలబెట్టారు. ఇప్పుడు ఇవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2, కల్కి, దేవర, హనుమాన్, సలార్.. ఇలా మూవీ హీరోల రూపాలతో ఉన్న గణేషుడు అందర్ని ఆకట్టుకుంటున్నాడు.

ఇటీవలే విడుదలైన కల్కి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. ఈ సారి ఇదే థీమ్ తో తమిళనాడులో అశ్వత్థామ విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. అలాగే సలార్ మూవీలో ప్రభాస్ విగ్రహం కూడా తయారు చేసారు. అనంతపురంలో సలార్ గణేశుడిని నిలబెట్టి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ విగ్రహం చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

రీసెంట్ గా పుష్ప నుంచి కపుల్ సాంగ్ వచ్చిన సంగతి మనకి తెలిసిందే. అచ్చం అలాగే వినాయక విగ్రహం తయారు చేసారు.. ఇది అన్నింటి కంటే చాలా వైరైటీగా ఉంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన హనుమాన్ మూవీలో హీరోగా తేజ సజ్జా నటించాడు. ఈ సినిమాలో హనుమంతుడి గెటప్ లో ఉన్న గణేషుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. టీమిండియా క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ ను గెల్చుకుంది. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విగ్రహాలను ప్రతిష్ఠించారు

Advertisement

Next Story