ఈ విజయం నాలాంటి వారెందరికో స్ఫూర్తి.. అచ్చం డైరీలో రాసుకున్నట్లే జరిగింది

by Prasanna |   ( Updated:2023-08-28 06:30:05.0  )
ఈ విజయం నాలాంటి వారెందరికో స్ఫూర్తి.. అచ్చం డైరీలో రాసుకున్నట్లే జరిగింది
X

దిశ, సినిమా: జాతీయ అవార్డు అందుకోవడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందంటోంది నటి కృతిసనన్‌. ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఎంపికైన కృతి ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్‌తో కలిసి అవార్డు షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మాట్లాడుతూ.. ‘ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాలాంటి వారు ఇలాంటి అవార్డు గెలుచుకోవడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నా. అవార్డు వచ్చిందని తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. మా కుటుంబ సభ్యులందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ రోజంతా ఎంజాయ్ చేశా. జాతీయ అవార్డు గురించి ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఎప్పటికైనా జాతీయ పురస్కారం సాధించాలని 2020లోనే నా డైరీలో రాసుకున్నా. అది ఇప్పుడు నిజమైంది. అవార్డు వచ్చినంత మాత్రాన నేనేదో సాధించానని అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇదే ఇన్స్‌పిరేషన్‌తో ముందుకెళ్తా’ అని చెప్పుకొచ్చింది.

Also Read: బ్రేకింగ్: ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి Jr NTR డుమ్మా.. అదే కారణమా..?

Advertisement

Next Story

Most Viewed