ఈ సెప్టెంబర్ 2nd Pawan Kalyan ఫ్యాన్స్‌కు వెరీ స్పెషల్!

by Hamsa |   ( Updated:2023-08-31 08:24:35.0  )
ఈ సెప్టెంబర్ 2nd Pawan Kalyan ఫ్యాన్స్‌కు వెరీ స్పెషల్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమా షూటింగ్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఓజీ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటి నుంచే అభిమానులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు. పవన్ బర్త్ డే పురస్కరించుకుని నిర్యాతలు వరుస అప్డేట్స్‌ను వదలడానికి ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా నుంచి టీజర్‌తో పాటు పోస్టర్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు హరిహర వీరమల్లు నుంచి పోస్టర్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ నుంచి గ్లింప్స్ లేదా పోస్టర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, అదేరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉండటం విశేషం. దీంతో ఆరోజును పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద పండగలా భావిస్తున్నారనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి : నేడు Gautham Krishna Ghattamaneni పుట్టిన రోజు

Advertisement

Next Story