- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సినిమా కారణంగా నా మానసిక స్థితి మెరుగుపడింది : భూమి పెడ్నేకర్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపొతుంది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు, కథా బలమున్న చిత్రాల వైపే దృష్టి సారిస్తూ. సందేశాత్మక సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటివల ‘భక్షక్’ చిత్రం ద్యారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.. ‘ కాలం చాలా మారిపోయింది. థియేట్రికల్ రిలీజ్ అంటే చిత్రబృందంపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయినా ప్రశంసలు అందుకుంటాయి. ముందు సినీ పరిశ్రమలో ఉన్నవారు కలెక్షన్ నంబర్ గేమ్ నుంచి బయటపడాలి.
నా దృష్టిలో థియేట్రికల్, ఓటీటీ రెండూ ముఖ్యమే. సినిమాలు ఎక్కడ విడుదలైనా కథ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు. నటనతో ప్రభావం చూపించాలి కానీ నంబర్స్‌తో కాదు. ఇక ముందు నుండి సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఆ తరహా కథల దోరికితే ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఏదో ఒక పాత్రలో నటించే కంటే ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించడం బెస్ట్. చేసే పాత్ర కథను నడిపించేలా ఉండాలి. అలా ‘భక్షక్’ లో జర్నలిస్ట్‌గా నా పాత్రకు చక్కని ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా కారణంగా నాకు మానసిక స్థితి మెరుగుపడింది. ఇదొక కొత్త అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. నాకెంతో ఆనందంగా ఉంది. సోషల్ మీడియాలో సినిమా చాలా బాగుందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇది నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందుతున్న ‘భక్షక్’ విజయాన్ని ఆనందిస్తున్నా. ప్రతి ఒక నటీనటులకు ప్రశంసలు, ఆదరణ ఎంతో అవసరం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని తెలిపింది భూమి పెడ్నేకర్.
- Tags
- Bhumi pednekar