ఇది నాకు చాలా ప్రత్యేకం మొదటిసారి ట్రై చేస్తున్నా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
ఇది నాకు చాలా ప్రత్యేకం మొదటిసారి ట్రై చేస్తున్నా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకుని విడిపోయినప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. హిట్ సినిమా ‘లవ్ స్టోరీ’ తర్వాత వచ్చినవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే చై నటించిన దూత వెబ్ సిరీస్ మాత్రం అందరి మెప్పు పొంది హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తండేల్ షూటింగ్ మొదలైంది.

దీని నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే గత కొద్ది కాలంగా హిట్ కోసం తారాడుతున్న నాగచైతన్య ఆశలన్నీ తండేల్‌పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం తెగ కష్టపడిపోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ నేను తండేల్ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. మొదటిసారిగా ఈ రకమైన పాత్రను ప్రయత్నిస్తున్నాను. అయితే 2018లో శ్రీకాకుళం మత్స్యకారులకు జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

సాధారణంగా గుజరాత్ నుంచి వెళ్లి అక్కడ నుంచి చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఒకరోజు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి కూరుకుపోవడం వల్ల వారు పట్టుబడ్డారు. ఏడాదిన్నర పాటు జైలు జీవితం గడిపిన వారి ప్రయాణం.. చివరికి ఎలా బయటకు వచ్చారనేది తండేల్‌లో చూపిస్తాము’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై కామెంట్స్ వైరల్ కావడంతో మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా షూటింగ్ తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయమని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్‌ను అడుగుతున్నారు.


Next Story

Most Viewed