వరల్డ్ ఫేమస్ డిష్‌లో ఇండియన్ కీమా.. దీనికి ప్రపంచమే ఫిదా అయిపోయిదంట!

by Disha Web Desk 8 |
వరల్డ్ ఫేమస్ డిష్‌లో ఇండియన్ కీమా.. దీనికి ప్రపంచమే ఫిదా అయిపోయిదంట!
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది భారతీయ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మన భారతీయులుకు ఇష్టమైన ఓ ఫుడ్‌కు ప్రపంచం సైతం ఫిదా అయిపోయిందంట. అసలు ఆ ఫుడ్ ఐటమ్ ఏంటీ అనే కదా మీ ఆలోచన..అదే కీమా. కీమా అంటే చాలా మంది లొట్టలేసుకొని తింటుంటారు. ఇక మన భారత్‌లో దీనిని చాలా ఇష్టంగా తింటారు. మంచి మసాలలు వేసి, ఆయిల్‌లో ఉడకబెట్టి..తింటే ఆ రుచికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే! అలా వరల్డ్ కూడా ఆ టేస్ట్‌కు పడిపోయింది.

అయితే తాజాగా Best stews in the world పేరిట టేస్ట్ అట్లాస్ ఓ లిస్ట్ విడుదల చేసింది. అందులో ఇండియాలోనే కొన్ని ఫుడ్ ఐటమ్స్‌లో 9 వంటకాలు టాప్‌లో నిలిచాయి. ఇదులో మొత్తం 50 రకాల డిషెస్ ఉండగా, భారత్‌కు చెందిన కీమా ఆరోస్థానం దక్కించుకోవడం ఆనందించాల్సిన విషయం.కీమా వంటకం టేస్ట్‌కు వరల్డ్ సైతం ఇష్టపడింది.. అందుకే టాప్‌లో ఆ వంటకం నిలిచింది అంటున్నారు.అంతే కాకుండా ఇండియాను నుంచి ఏకంగా 9 వంటకాలు టాప్‌లో ఉండటం కూడా అరుదైన రికార్డు.

కాగా, ఇండియా నుంచి ఏ వంటకాలు లిస్ట్‌లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..గోవా నుంచి Vindaloo డిష్26వ స్థానం, Dal Tadka 30వ స్థానం,32 వస్థానంలో సాగ్ పనీర్,షాహి 34వస్థానంలో నిలవగా,బెంగాల్ నుంచి Chingri malai curry 18వ స్థానం, korma వంటకం 22వ స్థానంలో నిలిచాయి. అలాగే మహారాష్ట్ర నుంచి Misal 36వ స్థానంలో నిలిచింది.దీంతో భారతీయుల్లో ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంది. ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ని వంటకాలు లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడంతో వారు చాలా హ్యాప్పీగా ఫీల్ అవుతున్నారు.



Next Story

Most Viewed