ఆ యూనివర్శిటీలో 120 మందికి పైగా విద్యార్థులు అరెస్ట్.. కారణం ఇదే..! (వీడియో)

by Disha Web Desk 3 |
ఆ యూనివర్శిటీలో 120 మందికి పైగా విద్యార్థులు అరెస్ట్.. కారణం ఇదే..! (వీడియో)
X

దిశ వెబ్ డెస్క్: నెలలు గడుస్తున్నా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్దానికి మాత్రం తెరపడడం లేదు. నిద్రపోతున్న ఇజ్రాయిల్‌ను హమాస్ తట్టిలేపింది. దీనితో పాలస్తీనాను పునాధులతో సహా పెకిలిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయిల్‌ తోక తొక్కిన త్రాచులా పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇప్పటికే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. కాగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో మొదలైన ఈ నిరసన మెల్లగా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయానికి చేరుకుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

ఈ నేపథ్యంలో నిన్న ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న 125 మంది నిరసనకారులను నెదర్లాండ్స్‌ అధికారులు అరెస్ట్ చేశారు. అలానే నిరసనకారుల శిబిరాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనితో ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పాలస్తీనాకు అనుకూలంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు బుల్‌డోజర్‌‌తో తొలిగిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed