ప్రభాస్‌కి ఆ హీరోయిన్‌తో ఉన్న సీక్రెట్ ఎఫైర్‌ని బయటపెట్టిన అల్లు అర్జున్..!

by Dishafeatures1 |
ప్రభాస్‌కి ఆ హీరోయిన్‌తో ఉన్న సీక్రెట్ ఎఫైర్‌ని బయటపెట్టిన అల్లు అర్జున్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ మూవీకి సీక్వెల్ గా ‘ఆర్య 2’ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ లో చాలామంది ప్రముఖ దర్శకులతో పాటు హీరో ప్రభాస్ కూడా గెస్ట్ గా వచ్చారు. అయితే ఇందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నాకు కూడా ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు… నా సినిమాల కంటే అల్లు అర్జున్ కి మంచి పాటలు అందించారు. అయిన కూడా నేను అంతగా ఫీల్ అవ్వను.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే కాజల్ తో నేను ఈ మధ్యనే పనిచేశాను.. అంటూ తన డార్లింగ్ మూవీ గురించి ప్రభాస్ చెప్పుకొచ్చారు. కానీ మధ్యలో అల్లు అర్జున్ మైక్ తీసుకుని కాజల్ ని మర్చిపోతారా అన్నట్లు వెరైటీ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడారు.

అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. బన్నీ చెప్పేదంతా అబద్ధం. ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అని సినిమా గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడున్న జనాలందరూ ఎవరికి వారే ప్రభాస్ కి హీరోయిన్ కాజల్ తో సంథింగ్ ఏదో నడుస్తుంది అని అరుపులతో గోల గోల చేశారు. దాంతో ప్రభాస్ స్టేజి దిగి కిందకి వచ్చేశారు.

Read More...

సూపర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో మహేష్ బాబు

Next Story

Most Viewed